ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి ఘటనకు ముందుగా ఏం జరిగిందంటే..

ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి ఘటనకు ముందుగా ఏం జరిగిందంటే..

pinnelli-ramakrishnareddy

ఇన్నాళ్లు నిరనస కోసం ఎత్తిన పిడికిళ్లు ఆగ్రహాన్ని నిబాయించుకోలేకపోయాయి. రాజధాని కోసం త్యాగం చేసిన తమని ఆ రాజధానికే దూరం చేస్తున్నారంటూ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో 21 రోజులుగా శాంతియుతంగా జరిగిన అమరావతి ఆందోళనల్లో 22వ రోజు ఆందోళన ఉద్రిక్త ఘటనలకు దారితీసింది. ఏకంగా ఎమ్మెల్యే కారునే అడ్డుకోవటంతో రాజధాని రైతుల టెన్షన్ గా మారింది.

అమరావతి జేఏసీ పిలుపు మేరకు జాతీయ గుంటూరు సమీపంలోని చినకాకాని వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. అయితే..అదే సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రైతుల నిరసనసెగ తాకింది. ఎమ్మెల్యే కారును రైతులు అడ్డుకున్నారు. ఓ రైతుపై ఎమ్మెల్యే గన్ మెన్ చేయిచేసుకోవడంతో ఆగ్రహించిన సహచర రైతులు ఎమ్మెల్యే వాహనంపై రాళ్లదాడి చేశారు. ఈఘటనలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రైతులు పిన్నెల్లి కారును చుట్టుముట్టి దాడిచేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఎమ్మెల్యే కారు వేగంగా వెళ్లిపోయింది.ఈ ఘటనతో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళన కారులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుకు నిరసనగా పలువురు వాహనాలపై రాళ్లురువ్వారు. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో భాగంగా రైతులు విభిన్న మార్గాల్లో తరలివచ్చి జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. అంతకు ముందు మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా చినకాకాని వద్ద ట్రాఫిక్లో చిక్కుకున్నారు.

అయితే ఎమ్మెల్యే అనిల్ పై జరిగిన రాళ్ల దాడికి తమకు సంబంధం లేదంటున్నారు రైతులు. ఇది ఎవరు చేశారో తమకు అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యే నాని మాత్రం తనపై దాడి చేయించింది టీడీపీ నేతలేనని అంటున్నారు. రైతుల ముసుగులో వచ్చి తనపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story