120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు

120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు

nagireddy

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే షెడ్యూల్ ప్రకటించారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం యథాతథంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహిస్తామని తెలిపారు.

మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం జనవరి 8 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 12, 13 తేదీల్లో తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. 14న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జనవరి 22న పోలింగ్, 25న కౌంటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాల్టీల్లోని 325 కార్పొరేటర్, 2 వేల 727 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story