సుజుకీ స్కూటర్ సూపర్‌గా ఉందిగా.. సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి..

సుజుకీ స్కూటర్ సూపర్‌గా ఉందిగా.. సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి..

suzuki

టూ వీలర్ వాహన సంస్థ సుజుకీ.. మార్కెట్లోకి సరికొత్త మోడల్ యాక్సెస్ 125 స్కూటర్‌ను తీసుకువచ్చింది. ఆ సంస్థ BS6 ప్రమాణాలకు అనుగుణంగా ఈ బైక్ తయారు చేసి మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దేశ వ్యాప్తంగా BS6 ప్రమాణాలు అమలులోకి వచ్చాయి. సరికొత్త ఫీచర్స్‌తో యాక్సెస్ 125ను లాంచ్ చేసినట్లు సంస్థ ఎండీ కొయిచిరో హిరాన్ వెల్లడించారు. ఇక ఈ స్కూటర్‌కు ఉన్న ఫీచర్లను పరిశీలిస్తే.. అల్లాయ్ డ్రమ్ బ్రేక్, అల్లాయ్ డిస్క్ బ్రేక్, స్టీల్ డ్రమ్ బ్రేక్, LED హెడ్‌లైట్, బాహ్యంగానే పెట్రోల్ క్యాప్, డిజిటల్ స్క్రీన్ అందుబాటులో ఉన్నాయి. దీనికి ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.64,800 ఉండగా.. స్పెషల్ ఎడిషన్ ధర రూ.69,500గా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. సరికొత్తగా ముస్తాబైన ఈ స్కూటర్ వినియోగదారులను ఆకర్షిస్తుందని సంస్ధ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Read MoreRead Less
Next Story