విజయవాడలో టెన్షన్‌ వాతావరణం

విజయవాడలో టెన్షన్‌ వాతావరణం

chandrababu

విజయవాడలో టెన్షన్‌వాతావరణ ఏర్పడింది. అమరావతి జేఏసీ బస్సులను నిలిపివేసిన గురునానాక్‌ ప్రాంతానికి.. పాదయాత్రకు వెళ్లాలని నిర్ణయించారు అఖిలపక్షం, జేఏసీ నేతలు. అయితే.. విషయం తెలుసుకున్న పోలీసులు.. వీరిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చంద్రబాబుతో పాటు జేఏసీ నేతలు పాదయాత్ర ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయితే తాము చట్ట విరుద్దంగా ఎలాంటి ఆందోళన చేయడం లేదన్నారు చంద్రబాబు. శాంతియుతంగానే నిరసన తెలియజేస్తున్నా.. పోలీసులు అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు.

Tags

Next Story