బంద్‌లో భాగంగా.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో నిరసనలు

బంద్‌లో భాగంగా.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో నిరసనలు

bandh_1-770x433

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్త సమ్మె ప్రభావం విశాఖలో కనిపిస్తోంది. కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో అన్ని భారీ పరిశ్రమల్లో కార్మికులు విధులకు వెళ్లకుండా నిరసన తెలుపుతున్నారు. కార్పొరేట్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చూస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు..

ట్రేడ్‌ యూనియన్లు దేశ వ్యాప్తంగా పిలుపు ఇచ్చిన బంద్‌లో భాగంగా.. స్టీల్‌ప్లాంట్‌లో నిరసనలు మిన్నంటాయి. 25 కార్మికసంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. కార్మిక చట్టాల కుదింపును వ్యతిరేకించడంతో స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన విలువైన భూములను ఉత్తరకొరియా సంస్థ పోస్కోకు కట్టబెట్టడాన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story