జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ బృందం పర్యటన

జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ బృందం పర్యటన

jammu-and-kashmir

జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ బృందం పర్యటించింది. వివిధ దేశాలకు చెందిన 16 మంది ప్రతినిధులు కశ్మీర్‌ను సందర్శించారు. వివిధ వర్గాల ప్రజలు, అధికారులు, పోలీసులతో విదేశీ ప్రతినిధులు సమావేశమయ్యారు. స్థానిక పరిస్థితులు, ఇటీవలి పరిణామాలు, శాంతి భద్రతలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం కూడా విదేశీ ప్రతినిధుల పర్యటన కొనసాగనుంది. యూరోపియన్ యూ నియన్‌కు చెందిన ప్రతినిధులు మాత్రం ఈ టూర్‌కు దూరంగా ఉన్నారు.

గత ఏడాది ఆగస్ట్ 5న ఆర్టికల్-370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం కశ్మీర్‌లో ఆంక్షలు విధించారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా భారీగా బలగాలను మోహరించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడ్డాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొంది. ఐతే, విపక్ష నాయకుల గృహ నిర్బంధం, ఇంటర్నెట్‌పై నిషేధం తదితర అంశాలపై ప్రతిపక్షాలతో పాటు ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌లో తాజా పరిస్థితిని ప్రపంచానికి వివరించడానికి చర్యలు తీసుకుంది. గత ఏడాది యూరోపియన్ యూనియన్‌కు చెందిన 23 మంది సభ్యుల బృందాన్ని కశ్మీర్‌కు ఆహ్వానించింది. తాజాగా మరో అంతర్జాతీయ బృందాన్ని కశ్మీర్‌కు పంపించింది.

Tags

Read MoreRead Less
Next Story