మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో అమరావతిపై బహిరంగసభ

మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో అమరావతిపై బహిరంగసభ

chandrababu

ప్రభుత్వ తీరుకు నిరసగా గురువారం కూడా పలు రూపాల్లో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గోనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మొదట జేఏసీ తలపెట్టిన చైతన్య యాత్రలో ఆయన పాల్గొంటారు. పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్న బెంజ్‌ సర్కిల్‌ ప్రాంతానికి మరోసారి వెళ్లి.. అక్కడ నిరసన తెలపనున్నారు. పోలీసులు అడ్డుకున్న ప్రాంతం నుంచే అమరావతిపై ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించనున్నారు. ఒకవేళ పోలీసులు అడ్డుకున్నా యాత్ర కొనసాగించాలని నిర్ణయించారు.

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఉదయం చంద్రబాబు మచిలీపట్నం వెళ్లనున్నారు. మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో మధ్యాహ్నం అమరావతిపై బహిరంగసభ నిర్వహించనున్నారు. మరోవైపు కాకినాడ, ఒంగోలు పట్టణాల్లోనూ చైతన్య సభలు నిర్వహించనుంది అమరావతి పరిరక్షణ కమిటీ.

Tags

Next Story