ఎట్టకేలకు ఇళ్లకు చేరిన మత్స్యకారులు

ఎట్టకేలకు ఇళ్లకు చేరిన మత్స్యకారులు

fishermen

పాక్‌ చెరలో 14 నెలలు బందీగా ఉన్న మత్స్యకారులు ఎట్టకేలకు ఇళ్లకు చేరారు. శ్రీకాకుళం జిల్లాలోని స్వస్థలాలకు చేరుకున్న వారిని చూసి.. కుటుంబ సభ్యులు తీవ్ర ఉద్యోగానికి లోనయ్యారు. నెలల తరబడి వారి కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురు చూసిన బాధ, ఆవేదన మర్చిపోయి సంతోషంలో మునిగిపోయారు. 20 మంది మత్స్యకారులు ఇళ్లకు చేరడంతో ఆత్మీయుల్ని కలుసుకుని కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. పాక్‌లో తమ అనుభవాలను చెప్తూ కన్నీటిపర్యంతం అయ్యారు. తమ విడుదలకు సహకరించిన ప్రతి ఒక్కరిగీ గంగపుత్రులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం మత్స్య.కారులకు ఎప్పుడూ అండగా ఉంటుదని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

Tags

Next Story