చంద్రబాబు అక్రమ అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న ప్రజానీకం

చంద్రబాబు అక్రమ అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న ప్రజానీకం

babu-arrest

అమరావతి పరిరక్షన కోసం జేఏసీ పిలుపు మేరకు బస్సుయాత్రలో పాల్గొన్న చంద్రబాబును, జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకోవటంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయాయి. ఆయన్ను అరెస్ట్ చేయటంతో ఒక్కసారిగా హై టెన్షన్ క్రియేట్ అయ్యింది. చంద్రబాబు, లోకేష్ తో పాటు జేఏసీ నేతల అరెస్ట్ చేయటంపై కేడర్ భగ్గుమంది. ఎక్కడిక్కడ జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు, నేతలు ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

చంద్రబాబు, జేఏసీ నేతల అరెస్ట్ కు నిరసనగా చిత్తూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలు, నేతలు ఆగ్రహంతో ఊగిపోయారు. తిరుపతి గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

చంద్రబాబు అరెస్ట్‌ నీచమైన చర్య అని మండిపడ్డారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలను , నేతలను అరెస్ట్ చేశారు.

అటు కుప్పం లో టీడీపీ శ్రేణులు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. శాంతి యుతంగా రైతుల కోసం పోరాటం చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే విదంగా జగన్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

అటు అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి పట్టణంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, జేఏసీ నాయకులు ధర్నాకు దిగారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నందిగామలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు అరెస్ట్‌పై మండిపడ్డారు. రోడ్డుపై బెఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ నేతను ఆరెస్ట్‌ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా అటు ఉత్తరాంధ్రలోనూ పార్టీ కేడర్ ఫైర్ అయింది. శ్రీకాకుళంలో పార్టీ కార్యకర్తలు, నేతలు ఆందోళనకు దిగారు.

చంద్రబాబు అరెస్ట్ తో పాటు అడుగడుగునా ఆయన్ని అడ్డుకొని..అమరావతి ఆందోళనలను అణికిచేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది జేఏసీ. పోలీసులు తీరును తప్పుబడుతూ ఇవాళ రాజధాని గ్రామాల్లో బంద్ కు పిలుపునిచ్చింది. అన్ని నగరాలు, జిల్లా, మండల కేంద్రాల్లో అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని జేఏసీ పిలుపునిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story