అమరావతి తరలిపోతుందన్న బాధతో గుండెపోటుతో మరో రైతు మృతి

సేవ్ అమరావతి అని నినదిస్తున్న కొందరి రైతుల గుండె చప్పుడు ఆగిపోతోంది. గత 23 రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నాప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్న రైతులు కొందరు గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో పాలేటి సుబ్బయ్య అనే రైతు మృతి చెందాడు. నిన్న రాత్రి 11 గంటలకు గుండెపోటు రావడంతో వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సుబ్బయ్య మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో పొన్నెకల్లులో విషాదచాయలు అలముకున్నాయి..
రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆశతో.. భవిష్యుత్తపై భరోసాతో తాము రాజధానికి భూములు ఇస్తే.. తిరిగిన తమపై అక్రమ కేసులు ఎలా పెడతారని రైతులు ప్రశ్నిస్తున్నారు.. అమరావతిని కాపాడుకునేందుకు తాము ప్రాణత్యాగాలకైనా సిద్ధమంటున్నారు రైతులు. అయినా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవడం లేదు. దీతో రైతులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఇప్పటికే పది మందికిపైగా రైతులు మృతి చెందారని..? ఇంకా ఈ ప్రభుత్వ ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటుందని రైతులు నిలదీస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com