బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి.. ధర చూస్తే..

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి.. ధర చూస్తే..

bajaj

బజాజ్ చేతక్ కొత్త హంగులతో మార్కెట్లోకి వస్తుంది. జనవరి 14న లాంఛ్ చేయనున్నారు. చేతక్ విక్రయాలు మొదట పూణేలో ప్రారంభమవుతాయి. ఆ తరువాత దశల వారీగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై సహా పలు మెట్రో నగరాల్లో విక్రయిస్తారు. స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన తరువాతనే బుకింగ్స్ ప్రారంభమవుతాయి. 85 కిలో మీటర్ల దూరం.. బజాజ్ చేతక్ 4kW ఎలక్ట్రిక్ మోటార్, దానికి శక్తిని ఇచ్చి లిథియం అయాన్ బ్యాటరీలను అమర్చారు.

దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 95 కిలో మీటర్ల దూరం వెళుతుంది. అదే స్పోర్ట్స్ మోడల్ అయితే 85 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే మెటల్ బాడీ, ఎల్‌ఈడీ లైట్లు, సైడ్ స్టాండ్, ఇండికేటర్ ఫీచర్స్, పిలియన్ ఫ్రూట్‌పెగ్స్ ఉన్నాయి. అలాయ్ వీల్స్‌తో పాటు బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్ సిస్టంను అమర్చారు. మూడేళ్లు లేదా 50 వేల కిలోమీటర్లు వారెంటీ ఇస్తోంది కంపెనీ. మరి చేతక్ ధర విషయానికి వస్తే.. దాదాపు రూ.1.20 లక్షలు (ఎక్స్ షోరూం) ఉంటుందని అంచనా.

Read MoreRead Less
Next Story