హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు జనవరి 10..

హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు జనవరి 10..

ecil

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 185 పోస్టులకు గాను గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని నియమించనుంది సంస్థ. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ జనవరి 10. ఆసక్తి గల అభ్యర్ధులు http://portan. mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

మొత్తం ఖాళీలు: 185

గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్: 165.. సీఎస్‌ఈ: 100.. ఈసీఈ: 31.. మెకానికల్: 19.. ఈఈఈ: 10.. సివిల్: 5.. టెక్నీషియన్ అప్రెంటీస్: 20.. ఈసీఈ: 10.. సీఎస్ఈ: 10.. దరఖాస్తు ప్రారంభం: 2020 జనవరి 2.. దరఖాస్తుకు చివరి తేదీ: 2020 జనవరి 10. విద్యార్హత: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి. వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

Read MoreRead Less
Next Story