మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అరెస్ట్

alapati

గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయనతో పాటు టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. తెనాలి మండలం కంచర్లపాలెం వద్ద ఆలపాటిని అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న పోలీసులను.. కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు.

Tags

Next Story