పెను ప్రమాదాన్ని నివారించిన చెన్నై పోలీసులు

పెను ప్రమాదాన్ని నివారించిన చెన్నై పోలీసులు

police

పెను ప్రమాదాన్ని చెన్నై పోలీసులు నివారించారు. ఖాకీలు అప్రమత్తంగా ఉండడంతో మారణహోమం తప్పిపోయింది. దేశంలో పలు ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్ని జిహాదీ ముఠాను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో 8 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురు తమిళనాడుకు చెందినవారు కాగా, ముగ్గురు కర్ణాటక చెందినవారుగా గుర్తించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేశారు. నిందితులను చెన్నై కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది.

తమిళనాడులో ఉగ్రవాదుల కదలికలపై కొంతకాలంగా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. కర్ణాటక పోలీసులు, ఇతర సంస్థల సాయంతో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 8 మందితో కూడిన జిహాదీ ముఠాను అరెస్టు చేశారు. బెంగుళూరులో అరెస్టైన ముగ్గురు నిందితులను మహ్మద్ హనీఫ్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, మహ్మద్ జాయిద్‌గా గుర్తించారు. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story