ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన మా వరకు రాలేదు: కిషన్ రెడ్డి

ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన మా వరకు రాలేదు: కిషన్ రెడ్డి

kishanreddy

తెలంగాణ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం ప్రగతి భవన్ దాటడం లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అన్ని డివిజన్లలోనూ పోటీ చేస్తుందని.. అందుకు తగిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయని చెప్పారు. కుటుంబ రాజకీయాలు పోవాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు కిషన్ రెడ్డి.

అటు, ఏపీలో 3 రాజధానుల ప్రతిపాదన తమ వరకు రాలేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. అయితే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం భూములు తీసుకున్నప్పుడు.. ఆ ఒప్పందాలను అమలు చేయాల్సిన బాధ్యత సర్కారుపైనే ఉంటుందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story