లంచం కావాలా నాయినా.. అయితే గేదెను తీసుకో..

లంచం కావాలా నాయినా.. అయితే గేదెను తీసుకో..

MP

శుభ్రంగా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నారు.. అయినా డబ్బు మీద ఆశ. వచ్చే జీతం చాలదనా గీతం కోసం చేయి చాస్తుంటారు. చిన్న పనికి కూడా వేలకు వేలు లంచం డిమాండ్ చేస్తుంటారు. ఉన్నవాడికి వంగి వంగి నమస్కారాలు.. వాళ్లు అక్రమంగా సంపాదించినా అడిగే వాళ్లు ఉండరు. మాలాంటి చిరు జీవితాల దగ్గరా మీ ప్రతాపం అని లంచం అడిగిన ఎమ్మార్వోకి గేదెను తీసుకువచ్చి అప్పగించింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధీ జిల్లాకు చెందిన ఓ మహిళ.

తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తికి మ్యుటేషన్ కోసమని ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లింది. అక్కడ అతను ఆమె పని చేసి పెట్టడానికి రూ.10 వేలు లంచం అడిగాడు. నా దగ్గర అంత డబ్బులదయ్యా అన్నా వినిపించుకోకుండా అయితే తర్వాత రా అంటూ ఇప్పటికి చాలా సార్లు తిప్పించుకున్నారు ఎమ్మార్వో. దాంతో ఆమెకు తిక్కరేగి ఒక రోజు తన కుటుంబానికి ఆధారమైన పాలిచ్చే గేదెను తీసుకుని ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లింది.

ఇదిగో సారు ఇదే నా దగ్గర ఉంది. ఇది తీసుకుని నా పని చేసి పెట్టండి అని అనేసరికి ఎమ్మార్వో షాక్ అయ్యాడు. బల్ల కింద చెయ్యి పెట్టి డబ్బు తీసుకుంటే ఎవరికీ కనిపించదనుకుంటే.. ఈమె ఏకంగా గేదెను తీసుకొచ్చి మీరడిగిన లంచం తీసుకోండి అని అనేసరికి పరువు పోయినట్టు ఫీలయ్యాడు. ఆమె మీద ఫై అధికారులకు ఫిర్యాదు చేశాడు.

Read MoreRead Less
Next Story