ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇచ్చిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇచ్చారు. ఢిల్లీ వేదికగా తలపెట్టిన ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశానికి దూరంగా ఉండాలని మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. బెంగాల్‌లో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని దీదీ ఆరోపించారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల తీరు కారణంగానే ఢిల్లీ అపోజిషన్ మీటింగ్‌కు తాను హాజరు కావడం లేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తాను ఒంటరిగానే పోరాడతానని విస్పష్టంగా ప్రకటించారు.
ప్రతిపక్షాలు ఈ నెల 13న ఢిల్లీలో సమావేశం కానున్నాయి. కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, వామపక్ష పార్టీల నాయకులు ఈ మీటింగ్‌కు హాజరుకానున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. జేఎన్‌యూలో ఇటీవలి హింసాకాండపైనా మంతనాలు జరపనున్నారు. ఈ మీటింగ్‌కు మమతా బెనర్జీ కూడా హాజరవుతారని తొలుత ప్రచారం జరిగింది. ఐతే, తాను రావడం లేదంటూ మమతా బెనర్జీ ఊహించని షాక్ ఇచ్చారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com