అమరావతి పోలీసులపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్
BY TV5 Telugu9 Jan 2020 1:02 AM GMT

X
TV5 Telugu9 Jan 2020 1:02 AM GMT
పోలీసులపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. మహిళా రైతులపై పోలీసుల దాడిని సుమోటాగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. మహిళా రైతులు పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును చైర్ పర్సన్ రేఖాశర్మ తప్పుబట్టారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతు కుటుంబాలు ఆందోళనలకు దిగిన సయమంలో మహిళా రైతుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించినట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర నివేదికను కోరుతూ ఏపీ డీజీపీకి నోటీసులు ఇచ్చింది. అలాగే బాధ్యుతలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Next Story