ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం.. కార్మికుడు సజీవదహనం

ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం.. కార్మికుడు సజీవదహనం
X

fire

ఢిల్లీని వరుస అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. వారం రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే మరో అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని పట్పర్‌గంజ్‌ పారిశ్రామికవాడలోని ఓ పేపర్ ప్రింటింగ్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అగ్నికీలలకు ఒక కార్మికుడు సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 35 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు పోలీసులు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story