సూర్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా మంత్రి జగదీష్‌ సతీమణి ?

సూర్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా మంత్రి జగదీష్‌ సతీమణి ?

sunitha-reddy

సూర్యపేట మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా మంత్రి జగదీష్‌రెడ్డి సతీమణి సునీతరెడ్డి రావాలంటూ.. సూర్యపేట పౌరసమాజం పేరుతో.. కరపత్రాలు బయటకి రావడం కలకలం సృష్టిస్తోంది. దీంతో ఇప్పటివరకు ఛైర్‌పర్సన్‌ పదవిని ఆశిస్తున్న ఆశావహుల గుండెల్లో గుబులు మొదలైంది. కరపత్రాలు అభిమానుల పనేనా లేక అధిష్టానం మనసులోనూ ఇదే ఉందా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.

మంత్రి జగదీష్‌ రెడ్డి సతీమణి సునీతారెడ్డి ప్రతి ఎన్నికల్లోనూ తన భర్త కోసం పార్టీ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలో జరిగే ప్రతి పండుగలు, వేడుకలకు స్థానిక ప్రజలు ,మహిళలతో కలిసి పాల్గొంటున్నారు. ఇక తమ పౌండేషన్‌ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో మంత్రి సతీమణి ఛైర్‌పర్సన్‌గా వస్తే... సూర్యాపేట మరింత అభివృద్ధి చెందుతుందని అందుకే ఈ కరపత్రాన్ని రిలీజ్‌ చేసినట్లు అభిమానులు చెబుతున్నారు. అయితే.. ఛైర్మన్‌ పదవి ఆశిస్తున్న వారిలో ఈ కరపత్రం ఇప్పుడు గుబులు రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story