నివురుగప్పిన నిప్పులా రాజధాని ప్రాంతం

నివురుగప్పిన నిప్పులా రాజధాని ప్రాంతం

chandrababu

రాజధాని ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. అమరావతి పరిరక్షణ సమితి బస్సుయాత్రను అడ్డుకోవటంతో పాటు చంద్రబాబు, లోకేష్, జేఏసీ నేతల అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ రైతు కార్యచరణ సమితి ఇవాళ బంద్ కు పిలుపునిచ్చింది.

అటు.. రాజధాని అమరావతిపై జేఏసీ చైతన్య యాత్రలో చంద్రబాబు పాల్గొననున్నారు. నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్న...విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ప్రాంతానికి నేడు చంద్రబాబు వెళ్లనున్నారు. జేఏసీ కార్యాలయంలో అమరావతి పరిరక్షణ కమిటీ నేతలతో సమావేశమవుతారు. పోలీసులు అడ్డుకున్న ప్రదేశం నుంచే..అమరావతిపై ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించనున్నారు. బస్సు యాత్రను పోలీసులు అడ్డుకున్నా నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. చంద్రబాబు నేతృత్వంలో బెంజ్ సర్కిల్‌ నుంచి ర్యాలీగా జేఏసీ ప్రతినిధులు వెళ్లనున్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఇవాళ చంద్రబాబు మచిలీపట్నం వెళ్లనున్నారు. కోనేరు సెంటర్‌లో మధ్యాహ్నం అమరావతిపై బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అటు.. కాకినాడ, ఒంగోలులోనూ ప్రజా చైతన్య సభలులను అమరావతి పరిరక్షణ కమిటీ నిర్వహించనుంది.

విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ దగ్గర అర్ధరాత్రి వరకు హైడ్రామా నెలకొంది. అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయం ప్రారంభం తర్వాత అక్కడి నుంచే.. బస్సు యాత్ర మొదలవ్వాల్సి ఉంది. అయితే.. పోలీసులు ఎంటరవడం అఖిలపక్ష నాయకుల ఆగ్రహానికి, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. యాత్రకు బయల్దేరాల్సిన బస్సుల్లో కొన్నిటిని మందడం గ్రామానికి, మరికొన్నిటిని గురునానక్‌ కాలనీకి పోలీసులు తరలించారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు.. గురునానక్ కాలనీకి పాదయాత్రగా బయల్దేరారు. ఆయనతో పాటు ఇతర పార్టీల నేతలు అడుగులేశారు. పోలీసులు అందరినీ అడ్డుకున్నారు. బస్సులకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని జేఏసీ నేతలు చెప్పారు. ఏ రూల్‌ కింద ఇలా వ్యవహరిస్తున్నారో చెప్పాలని పోలీసులను చంద్రబాబు నిలదీశారు. ఈ దమనకాండ ఏమిటని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. బెంజ్‌ సర్కిల్‌లో నడిరోడ్డుపైనే ఆయన బైఠాయించారు. నిరసన తెలియజేశారు. చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో.. చంద్రబాబు నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను నివాసం దగ్గర దింపారు.

అటు.. అర్దరాత్రి వరకు ఆందోనళతో దద్దరిల్లిపోయిన రాజధాని ప్రాంతం ఇవాళ బంద్ పాటించనుంది. అమరావతి పరిరక్షణ సమితి బస్సుయాత్రను అడ్డుకోవటంతో పాటు చంద్రబాబు, లోకేష్, జేఏసీ నేతల అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ రైతు కార్యచరణ సమితి ఇవాళ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలు బంద్ పాటిస్తున్నాయి. అన్ని గ్రామాల్లో వ్యాపారాలను, స్కూళ్లను స్వచ్ఛదంగా మూసేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాడరు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా..జనం లెక్క చేయటం లేదు. అమరావతి పరిరక్షణ కోసం రైతు కార్యచరణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు జనం ఎక్కడిక్కడ నిరసనకు దిగారు. పోలీసు దౌర్జన్యంతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని అమరావతి పరిరక్షణ జేఏసీ అంటోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో 5 జిల్లాల్లో బస్సుయాత్రకు సన్నాహాలు చేసింది జేఏసీ. నిన్నటి నుంచే ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే..బస్సు యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు నిలిపివేయడమే ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమైంది.

మరోవైపు అటు అమరావతి పరిరక్షణ జేఏసీ కూడా పోలీసులు తీరుపై భగ్గుమంటోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైంది. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనల ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఇక మచిలీపట్నంలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో అన్ని రాజకీయ పక్షాలు పాల్గొంటాయి. చంద్రబాబు కూడా మచిలీపట్నం ర్యాలీలోనే పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. రైతు జేఏసీతో రాజధాని ప్రాంతం బంద్ పాటిస్తుంటే..అమరావతి జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో నిరసనలు ప్రారంబం అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story