ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన పోలీసులు.. వీడియో వైరల్

ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన పోలీసులు.. వీడియో వైరల్

bengal-police

సమాజానికి రక్షణగా నిలవాల్సిన పోలీసులే దారి తప్పారు. ఆందోళనలను ఆపాల్సిన రక్షకభటులే హింసకు పాల్పడ్డారు. దాడులను నివారించాల్సిన ఖాకీలే దాడులకు తెగబడ్డారు. బెంగాల్‌లోని మాల్దా ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజా ఆస్తులను కాపా డాల్సిన పోలీసులే ప్రభుత్వ ఆస్తులను దహనం చేశారు. బస్సులు సహా పలు వాహనాలను తగులబెట్టారు.

మాల్దా జిల్లా సుజాపూర్‌లో ఆందోళనకారులు చెలరేగిపోయారు. భారత్‌బంద్ సందర్భంగా వాహనాలను తగులబెట్టారు. పలు చోట్ల ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. నిరసనకారులను అదుపుచేసే క్రమంలో పోలీసులు కూడా దాడులకు పాల్పడ్డారు. వాహనాలపై తమ ప్రతాపం చూపించారు. వాహనాల అద్దాలను పగులగొట్టారు. బస్సులకు నిప్పంటించి ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story