గుడ్డుని వలవడం ఇంత వీజీనా గురూ.. వీడియో వైరల్

గుడ్డుని వలవడం ఇంత వీజీనా గురూ.. వీడియో వైరల్

egg

ఉరుకుల పరుగుల జీవితంలో త్వరగా పనైపోయే ఏ ఈజీ టెక్నిక్ ఎవరు చెప్పినా హాట్సాఫ్ చెప్పాల్సిందే. గుడ్లు ఉడకపెట్టడం పనేం కాదు. స్టౌ మీద పెట్టి 10 నిమిషాలు ఉంచితే ఉడుకుతాయి. కానీ అవి వలవాలంటే మాత్రం కాసేపు చల్లారనివ్వాలి. నిదానంగా ఒక్కొక్కటీ వలవాలి. హడివిడిగా చేస్తే పెంకుతో పాటు వైట్ కూడా వచ్చేస్తుంది. మరి వేడిగా ఉన్నప్పుడే గ్లాసులో వేసి కాసిని చన్నీళ్లు పోసి బాగా షేక్ చేస్తే పెంకు తీయడం ఎంతో సులభం. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే గుడ్డు పెంకు వచ్చేస్తుంది. ఇది చూసి నెటిజన్లు సూపర్ ఐడియా గురూ అని కామెంట్ చేస్తున్నారు. అందరికీ షేర్ చేస్తున్నారు.

Read MoreRead Less
Next Story