అలా అయితే.. ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేపడతాం: అఖిలపక్షం

X

రాజధానిని మార్చితే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు అఖిలపక్ష నేతలు. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ.. కర్నూలు జిల్లా నంధ్యాలలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి అఖిలప్రియతోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గౌరు చరిత, పలువురు ఇతర పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని.. అఖిలపక్ష భేటీలో నేతలు డిమాండ్ చేశారు. రాజధాని మారిస్తే కర్నూల్లో ఏర్పాటు చేయాలని నేతలు అన్నారు. లేదంటే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేపడతామని అఖిలపక్ష సమావేశంలో నేతలు స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
