- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- ఉదృతమవుతున్న ఉద్యమం.. కొనసాగుతున్న...
ఉదృతమవుతున్న ఉద్యమం.. కొనసాగుతున్న అరెస్టుల పర్వం

అమరావతి రాజధాని ప్రాంతం రణరంగాన్ని తలపిస్తోంది. అందోళనలు.. అరెస్టులతో అమరావతి అట్టుడుకుతోంది. 24 రోజులుగా నిరసనలు తెలుపుతున్నా.. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోవడంతో.. మహాధర్నాలు, హైవే దిగ్భంధానాలు, రిలే దీక్షలతో ఉద్యామాన్ని ఇంకాస్త ఉధృతం చేస్తున్నారు. అయితే మరోవైపు ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే పేరుతో ఎక్కడిక్కడ టీడీపీ లీడర్లను.. జేఏసీ నేతలను అడ్డుకుంటున్నారు. ముందస్తుగానే హౌస్ అరెస్టులుచేస్తున్నారు.
అమరావతి రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న ఎంపీ కేశనేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వ్యక్తిగత పనిపై బయటకు వెళ్తున్నా అని చెప్పినా.. పోలీసులు అతడ్ని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
అటు ఏలూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి పరిరక్షణ బస్సుయాత్ర నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు, దెందులూరు హైవే మీదుగా, తాడేపల్లిగూడెం, తణుకు నుండి చంద్రబాబు బస్సుయాత్ర కొనసాగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా చింతమనేని ప్రభాకర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి జంక్షన్ దగ్గర జాతీయ రహదారిపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడ్ని పోలీసులు అడ్డుకున్నారు. రైతుల కోసం రాజమండ్రి వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని కలవడానికి వస్తున్న నేపథ్యంలో తణుకులో రామానాయుడ్ని అరెస్ట్ చేశారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com