సీఎం హోదాలో.. హాజరుకు వేళాయే

సీఎం హోదాలో.. హాజరుకు వేళాయే

cbi-court

ఆస్తుల కేసులో వైఎస్‌ జగన్‌ తొలిసారి సీఎం హోదాలో ఇవాళ సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఆయనతో పాటు, ఎంపీ విజయసాయి రెడ్డి సైతం కోర్టు ముందు హాజరువుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు తెలంగాణ పోలీసులు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నుంచి ఆయన ఈ ఆస్తుల కేసులో విచారణకు రావడం లేదు. అధికారిక కార్యక్రమాల కారణాలు చూపుతూ కోర్టుకు వెళ్ళడం లేదు. దీనిపై సీబీఐ కోర్టు సీరియస్‌ అయ్యింది. ప్రతివారం మినహాయింపు ఇవ్వడం కుదరదని.. ఏ 1, ఏ 2 నిందితులు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.. దీంతో ఆయన సీఎం జగన్‌ ఇవాళ సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు..

ఏపీ నుంచి హైదరాబాద్‌కు రావడానికి 60 లక్షల ఖర్చు అవుతోందని కోర్టుకు తెలిపారు జగన్‌ తరపు లాయర్లు.‌ ఏపీ ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నందున, ప్రతివారం కోర్టుకు హాజరుకావడంతో ఏపీ ప్రభుత్వంపై అదనపు ఆర్ధిక భారం పడుతుందని కోర్టుకు తెలిపారు. గత ఆరేళ్ల నుంచి ఆయన బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘించలేదని, కోర్టు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతున్నారన్నారు. అందుకే జగన్‌కు మినాయింపు ఇవ్వాలని కోరారు. అయితే ఈ వాదనను సీబీఐ వ్యతిరేకించింది. సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి... ఎలాంటి మినహాయింపు ఇచ్చినా కేసు విచారణపై ప్రభావం పడుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీంతో ప్రతివారం హాజరు మినహాయింపు ఇవ్వడం కుదరదన్న సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. అయితే జగన్‌.. అధికారిక హోదాలో ఎలా కోర్టుకు వస్తారని.. అంత ప్రజాధనం ఎలా వృథా చేస్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story