అమరావతి నుంచి రాజధానిని తరిలించాలన్న ప్రభుత్వ ప్రతిపాదన రైతుల ప్రాణాలు తీస్తోంది

అమరావతి నుంచి రాజధానిని తరిలించాలన్న ప్రభుత్వ ప్రతిపాదన రైతుల ప్రాణాలు తీస్తోంది

farmer

అమరావతి నుంచి రాజధాని తరిలించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు రైతలు ప్రాణాలు తీస్తోంది. రాజధాని కోసం ఆందోళనలు చేపట్టిన ఈ 23 రోజుల్లోనే 11 మంది ప్రాణాలు వదిలారు. రాజధాని దర్పాన్ని చూసి..తమ భవిష్యత్తుకు బాటలు పడుతున్నాయనే నమ్మకంతోనే ఏడాది మూడు పంటలు పండే భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చామని అంటున్నారు రైతులు. రాజధాని తరలింపుతో ఇప్పుడు తమ బతుకులు, పిల్లల భవిష్యత్తు రోడ్డున పడుతున్నాయని రైతు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తుపై బెంగతో రాజధాని ప్రాంతంలో రోజుకో చోట రైతు కటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి.

మొన్న ఒక్క రోజే ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే నిన్న తుళ్లూరు మండలం దొండపాడుకు చెందిన రైతు కొమ్మినేని వెంకటేశ్వరరావు చనిపోయాడు. రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో ఆయన చనిపోయారంటున్నారు కుటుంబసభ్యులు.

అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దంటూ మరో రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తుళ్లూరులో ఎలమంచలి శివ అనే రైతు పురగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించటంతో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు.

రాజధాని కోసం రోజుకో రైతు ప్రాణాలు బలితీసుకుంటున్న ప్రభుత్వం తీరుపై లోకేష్ మండిపడ్డారు. 11 మంది రైతులు చనిపోతే ఒక్కరు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పైగా రాజధాని కోసం పోరాడుతున్న రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులని అవమానిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని రైతులకు మద్దతుగా అమరావతి ప్రాంతంలో పర్యటించి వారికి సంఘీభావం తెలిపిన లోకేష్..రాజధాని గ్రామాల ప్రజలను టెర్రరిస్టుల్లా చూస్తోందని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిబిడ్డ అమరావతిని 3 ముక్కలుగా నరికేస్తున్నారని విమర్శించారు.

Tags

Next Story