దుబాయ్‌లోని ఇండియన్ కాన్సూలెట్ లో తత్కాల్ పాస్ పోర్ట్ సేవలు ప్రారంభం

దుబాయ్‌లోని ఇండియన్ కాన్సూలెట్ లో తత్కాల్ పాస్ పోర్ట్ సేవలు ప్రారంభం

dubai1

ఈ నెల 12 నుంచి దుబాయ్ లోని ఇండియన్ కాన్సూలెట్ లో తత్కాల్ పాస్ పోర్ట్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో దుబాయ్‌తో పాటు నార్తర్న్ ఎమిరేట్స్ లోని ప్రవాస భారతీయులు ఒకే రోజులో పాస్ పోర్ట్ పొందవచ్చు. మధ్యాహ్నం 12 గంటల లోపు పాస్ పోర్టుకు అప్లై చేసుకుంటే సాయంత్రం 6.30 గంటల వరకల్లా పాస్ పోర్ట్ అందిస్తామని దుబాయ్ కాన్సులేట్ లో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో కాన్సుల్ జనరల్ విపుల్ ప్రకటించారు. తత్కాల్ పాస్ పోర్టులను అత్యవసర పరిస్థితుల్లో అందించనున్నారు. తత్కాల్ పాస్ పోర్టు కోసం బుర్జ్ దుబాయ్ లోని అల్ ఖలీజ్ సెంటర్ లో ఉన్న BLS ఇంటర్నేషనల్ ఔట్ సోర్సింగ్ లో అప్లై చేసుకోవాలని విపుల్ తెలిపారు.

తత్కాల్ స్కీం కింద జారీ 36 పేజీలు ఉన్న పాస్ పోర్ట్ కు 855 దిర్హామ్ లు, 60 పేజీల పాస్ పోర్టుకు 950 దిర్హామ్ లు చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్ పాస్ పోర్ట్ లకు అయితే 36 పేజీలకు 285 దిర్హామ్‌లు, 60 పేజీల పాస్ పోర్టుకు 380 దిర్హామ్ లు చెల్లించాల్సి ఉంటుంది.

Read MoreRead Less
Next Story