ఆంధ్రప్రదేశ్

రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి: పేర్నినాని

రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి: పేర్నినాని
X

perni-nani

పాలనా వికేంద్రీకరణ దిశగా ఎలాంటి కార్యాచరణ ఉండాలనే దానిపై హైపవర్ కమిటీ సుదీర్గంగా చర్చించింది. బీసీజీ, జీఎన్‌రావు కమిటీల నివేదికతోపాటు శివరామకృష్ణన్‌ కమిటీపై కూడా చర్చించినట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. 13 జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 13వ తేదీన హైపవర్ కమిటీ మళ్లీ సమావేశం అవుతుందన్నారు. రైతులు, ఉద్యోగులతోపాటు అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకునే హైపవర్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజకీయ లబ్ది కోసం ప్రజల్ని రెచ్చగొట్టడం మానుకోవాలని విపక్షాలపై మండిపడ్డారు మంత్రులు. అభివృద్ధి ఒకే చోట జరగడం వల్లే గతంలో నష్టపోయామని ఇకపై అలా జరక్కూదన్నదే తమ లక్ష్యమని అన్నారు.

Next Story

RELATED STORIES