లోకేష్‌ను గృహనిర్బంధం చేసిన పోలీసులు

లోకేష్‌ను గృహనిర్బంధం చేసిన పోలీసులు

lokesh

ఏపీలో పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతోంది. రాజధాని మార్పు ప్రతిపాదనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఒంగోలు జిల్లా కొ్ప్పోలులో జర్నలిస్ట్‌ ప్రదీవ్‌ మృతదేహానికి నివాళులర్పించి.. తిరిగి వస్తున్న మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్‌ని మరో మారు అరెస్ట్ చేశారు పోలీసులు.

విజయవాడ వైపు వెళ్తున్న లోకేష్, కళా వెంకట్రావును కాజా టోల్‌ గేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. బెంజ్ సర్కిల్‌ వద్ద రాజధాని రైతుల పాదయాత్రకు వెళ్తారేమోనన్న కారణంతో లోకేష్‌ను టోల్‌గేట్ వద్దే అడ్డుకున్నారు.

మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటూ నోటీసులు ఇచ్చారు. దీంతో పోలీసుల తీరుపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. నేను చట్టాన్ని ఉల్లంఘించలేదు, ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు, నిరసన తెలిపే హక్కు ఒక పౌరుడిగా నాకు రాజ్యాంగం కల్పించిందంటూ పోలీసులపై మండిపడ్డారు. తాను ఒంగోలు పర్యటనకు వెళ్లి తిరిగివస్తున్నా అని, పార్టీ ఆఫీసుకు వెళ్తానని, రోజూ ఇలా అడ్డుకోవడం సరికాదని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, లోకేష్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి లోకేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు తన నివాసానికి తరలించారు. లోకేష్‌ను అక్కడే గృహనిర్బంధం చేశారు పోలీసులు.

మరోవైపు జగన్‌ పాలనపై ట్వీట్టర్‌ వేదికగా నిప్పులు చెరిగారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. అమరావతి కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న రైతులను, మహిళలను అరెస్టు చేయడం దారుణం అని ఫైర్‌ అయ్యారు. అమరావతి కోసం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా.. భరించేందుకు సిద్దమని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story