పదవతరగతి అర్హతతో రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు..

పదవతరగతి అర్హతతో రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు..

rail-jobs

భారతీయ రైల్వే వరుసగా రైల్వేతో పాటు రైల్వే అనుబంధ సంస్థలు కూడా నియామకాలు చేపడుతున్నాయి. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ 400 పోస్టుల్ని ప్రకటించింది. కపుర్తలాలో గల యూనిట్‌లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్ వంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ రూపొందించి అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. మరిన్ని ఇతర వివరాలకు రెల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్‌సైట్ https://rcf.indianrailways.gov.in చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 400... ఫిట్టర్: 100, వెల్డర్ (G & E): 100, మెషినిస్ట్: 40, పెయింటర్: 20, కార్పెంటర్: 40, మెకానిక్ (మోటార్ వెహికల్): 10, ఎలక్ట్రీషియన్: 56, ఎలక్ట్రానిక్ మెకానిక్: 14, ఏసీ & రిఫ్రిజిరేషన్ మెకానిక్: 20.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2020 జనవరి 8, దరఖాస్తుకు చివరి తేదీ: 2020 ఫిబ్రవరి 6, విద్యార్హత: 50% మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: 100.

Read MoreRead Less
Next Story