రాజధాని పోరాటంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్పీకర్‌ తమ్మినేని

రాజధాని పోరాటంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్పీకర్‌ తమ్మినేని

tammineni

రాజధాని పోరాటంపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో ఉన్న తమ ఆస్తులు కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటం తప్ప.. సహజ సిద్ధమైన ప్రజా ఉద్యమం కాదన్నారు. రాజధాని విషయంలో తేడాలొస్తే.. అసలైన ప్రజా ఉద్యమం ఏంటన్నది తాము చూపిస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులకు... ఈ ప్రాంత పేద ప్రజల కష్టాలు కనపడడం లేదా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వాసుల ఆకలి పోరాటంతో ఆడుకోవద్దని.. ఎంతటి త్యాగాలకైనా తాము సిద్ధంగా ఉంటామని తమ్మినేని అన్నారు.

Tags

Next Story