ఆంధ్రప్రదేశ్

తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత.. మహిళలపై లాఠీఛార్జ్‌

తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత.. మహిళలపై లాఠీఛార్జ్‌
X

amaravathi

తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తుళ్లూరు నుంచి కనకదుర్గ గుడికి రైతులు, మహిళలు పాదయాత్రగా వెళ్తుంటే మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు.. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు అతి దారుణంగా వ్యవహించారు.. రైతులపైనా.. మహిళలపైన లాఠీఛార్జ్‌ చేశారు.. అక్కడితో ఆగకుండా అందర్నీ బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో మహిళలు, రైతులు వాహనాలు అడ్డుపడి నిరసనలు తెలిపారు..

తాము పాకిస్థాన్‌లో ఉన్నా.. భారత్‌లోనే ఉన్నామా అని రైతులు నిలదీస్తున్నారు. అమ్మవారికి ప్రసాదం పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వరా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయినా పోలీసులు వినకుండా రైతులు, మహిళలపై దాడికి దిగారు. దీంతో కొందరిరి రక్తాలు కారినట్టు గాయాలయ్యాయి.

Next Story

RELATED STORIES