అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తీర్మానం చేసిన కడప అఖిలపక్ష నేతలు

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తీర్మానం చేసిన కడప అఖిలపక్ష నేతలు

11d0d106-ac7c-11e9-b419-859e409292bd_1563946778349_1563964891177

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కడప జిల్లాకు చెందిన అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. కడప నగరంలోని రహమతియ్య ఫంక్షన్ హాల్‌లో అమరావతి పరిరక్షణ సమితి, కడప పార్లమెంట్ స్థాయి జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమా వేశం నిర్వహించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగింపుపై వివిధ పార్టీల నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు వేల ఎకరాల భూములు ఇచ్చారని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. మూడు రాజధానులు కావాలని ఎవ్వరూ అడగలేదని అఖిలపక్ష నేతలు గుర్తు చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story