కుల, మతాలకు అతీతంగా ఉద్యమం చేసి ఈ దారుణాలను ఆపండి : ప్రజలకు సుజనా చౌదరి పిలుపు

కుల, మతాలకు అతీతంగా ఉద్యమం చేసి ఈ దారుణాలను ఆపండి : ప్రజలకు సుజనా చౌదరి పిలుపు

Sujana-Chowdarys-Tongue-Slip-Corners-TDP

ఆలయానికి వెళ్తున్న మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరును బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్రంగా ఖండించారు.. మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా, ఆప్ఘనిస్థాన్‌లో ఉన్నామా అనే అనుమానం వస్తోందన్నారు.. కుల, మతాలకు అతీతంగా అందరూ ఉద్యమం చేసి ఈ దారుణాలను ఆపాలని సుజనా చౌదరి పిలుపునిచ్చారు.. అవసరం లేకున్నా 144 సెక్షన్‌ పెడుతున్నారంటూ పోలీసుల తీరుపై సుజనా చౌదరి నిప్పులు చెరిగారు.. ఏ నిబంధనల ప్రకారం అర్థరాత్రి పోలీసులు ఇళ్లకు వెళ్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని సుజనా ప్రశ్నించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రినని జగన్‌ గుర్తుంచుకోవాలని సుజనా చౌదరి అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. 13 జిల్లాల ప్రజలు ఏకమై రోడ్లమీదకు రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ సిద్ధాంతం ఏదైనా ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై మాత్రం చూస్తూ ఊరుకోబోనన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, అమరావతిని అంగుళం కూడా కదలదని స్పష్టం చేశారు. పార్టీ సహకారం లేకపోయినా వ్యక్తిగతంగా అయినా పోరాడతానని సుజనా చౌదరి చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story