అందుకే రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారు : చంద్రబాబు

అందుకే రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారు : చంద్రబాబు

babu

ఏపీ రాజధాని అమరావతిని ఎందుకు మారుస్తున్నారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. తిరుపతిలో అమరావతి పరిరక్షణ ర్యాలీ జరిగింది. ప్రశాంతమైన విశాఖపట్నంలో భూములు కొట్టేయాలని వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అందుకే రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారని ఆయన విమర్శించారు.

పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో పోలీసులు సైతం ఆలోచించాలని సూచించారు. అమరావతి పరిరక్షణ జేఏసీ ర్యాలీకి సంఘీభావం తెలపకుండా.. చిత్తూరు జిల్లా నాయకులను అడ్డుకున్నారని చంద్రబాబు అన్నారు. అరెస్టులతో, గృహ నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story