చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

chidambaram

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయులందరూ అమాయకులని చిదంబరం పేర్కొన్నారు. తన జీవితంలో భారతీయులంత అమాయకులను ఎప్పు డూ చూడలేదని చిదంబరం చెప్పారు. ఎవరేం చెప్పినా ఏమాత్రం ఆలోచించకుండా ప్రతి దానిని నమ్మేస్తుంటారని వివరించారు. మోదీ సర్కారుపై చిదంబరం సెటైర్లతో విరుచుకుపడ్డారు.

దేశంలోని గ్రామాలన్నింటికీ విద్యుత్తు సదుపాయం కల్పించామని ప్రభుత్వం చెబితే ప్రజలు నమ్మేశారని చిదంబరం పేర్కొన్నారు. దేశంలో 99 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించారని చెబితే ఆ మాటను కూడా నమ్మేశారని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ పథకంపైనా చిదంబరం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి చెందిన తన కారు డ్రైవర్ తండ్రికి ఆయుష్మాన్ భారత్ కింద ఆపరేషన్ చేయించడానికి ప్రయత్నించి విఫలమమయ్యామని తెలిపారు. అక్కడి వైద్యులకు ఆయుష్మాన్ భారత్ పథకం గురించి అవగాహనే లేదన్నారు. కానీ, మోదీ సర్కారు మాత్రం ఆయుష్మాన్ భారత్ దేశమంతటికీ వర్తిస్తుందంటూ గొప్పలు చెప్పుకుంటోందని దుయ్యబట్టారు.

Tags

Read MoreRead Less
Next Story