ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఘోర ప్రమాదం

ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఘోర ప్రమాదం

accidentఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగి, 20 మందికిపైగా ప్రయాణికులు మృతి చెందినట్టు భావిస్తున్నారు. యూపీలోని చిలోయి గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఫరుఖాబాద్ నుంచి 45 మంది ప్రయాణికులతో జైపుర్ బయల్దేరిన ఏసీ బస్సు... చిలోయి వద్ద ట్రక్కును ఢీకొట్టింది. ఈ ధాటికి మంటలు అంటుకుని క్షణాల్లో వ్యాపించాయి. పోలీసులు 21 మందిని రక్షించి, ఆసుపత్రికి తరలించారు. అయితే 20 మందికిపైగా చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వాహనాలు బలంగా ఢీకొనడంతో డీజిల్ ట్యాంకు పగిలి భారీగా మంటలు విస్తరించి ఉండొచ్చని వారు చెప్పారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.

Tags

Next Story