ఈనెల 13వ తేదీన హైపవర్ కమిటీ మళ్లీ సమావేశం

పాలనా వికేంద్రీకరణ దిశగా ఎలాంటి కార్యాచరణ ఉండాలనే దానిపై హైపవర్ కమిటీ సుదీర్గంగా చర్చించింది. బీసీజీ, జీఎన్‌రావు కమిటీల నివేదికతోపాటు శివరామకృష్ణన్ కమిటీపై కూడా చర్చించినట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. 13 జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మళ్లీ 13వ తేదీన హైపవర్ కమిటీ మళ్లీ సమావేశం అవుతుందన్నారు.
రైతులు, ఉద్యోగులతోపాటు అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకునే హైపవర్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజకీయ లబ్ది కోసం ప్రజల్ని రెచ్చగొట్టడం మానుకోవాలని విపక్షాలపై మండిపడ్డారు మంత్రులు. అభివృద్ధి ఒకే చోట జరగడం వల్లే గతంలో నష్టపోయామని ఇకపై అలా జరక్కూదన్నదే తమ లక్ష్యమని అన్నారు.
మంత్రి చెరుకువాడ రంగనాథ్ రాజు మాత్రం హైపవర్ కమిటీ మీటింగ్ లో సంచలన ప్రతిపాదన చేశారు. ఏపీకి మూడు కాదు,నాలుగు రాజధానులు ఉండాలని అన్నారు. రాజమండ్రిని సాంస్కృతిక రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీలో సమావేశాల్లో ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాజకీయంగా ఉనికిని కాపాడుకునేందుకే చంద్రబాబు బస్సుయాత్ర చేపట్టారని విమర్శించారు మంత్రి రంగనాథ రాజు...
3 రాజధానుల ప్రతిపాదనతోనే ఆందోనలు, నిరసనలు రాష్ట్రం రగిలిపోతోంది. ఈ సమయంలో మంత్రి చెరుకువాడ 4 రాజధానుల ప్రతిపాదనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com