అక్రమ కట్టడాలపై కేరళ సర్కార్ ఉక్కుపాదం

అక్రమ కట్టడాలపై కేరళ సర్కార్ ఉక్కుపాదం

kerala

కేరళ సర్కార్ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భారీ భవనాలను నేలమట్టం చేస్తోంది. కొచ్చిలోని నాలుగు అపార్ట్‌మెంట్‌లను శనివారం, ఆదివారం కూల్చివేయనున్నారు. ఇప్పటికే ఓ భవనాన్ని హైటెక్నాలజీ తో కూల్చేశారు. దీన్ని 'బిల్డింగ్ ఇంప్లోజన్‌' టెక్నాలజీగా పిలుస్తారు. కేరళ కోస్టల్ రెగ్యులేఎషన్ జోన్‌-CJR నిబంధనలు ఉల్లంఘించినందున సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

H20 హోలీ ఫెయిల్, ఆల్ఫా సరేన్ బిల్డింగ్స్‌ను శనివారం కూల్చేస్తారు. ఇందులో ఒకటి ఇప్పటికే పడగొట్టేశారు. జైన్ కోరల్ కోవ్, గోల్డెన్‌ కయలోరామ్‌ బిల్డింగ్స్ ఆదివారం కూలుస్తారు. ఈ భవనాల్లో అపార్ట్‌మెంట్లు కొన్న వాళ్లకు పరిహారం విషయంపై కూడా కొన్ని నిబంధనలు రూపొదించారు. బాధిత కుటుంబాల పునరావాసానికి ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించింది.

Tags

Read MoreRead Less
Next Story