మహేష్.. సినిమా సూపర్.. సరిలేరు నీకెవ్వరు: ట్విట్టర్ రివ్యూ

మహేష్.. సినిమా సూపర్.. సరిలేరు నీకెవ్వరు: ట్విట్టర్ రివ్యూ

sarileru-neekevvaru

మహేష్ బాబు సినిమా అంటే సూపర్ స్టార్ అభిమానులకు పండగే. అందులో సక్సెస్ డైరక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంపై అంచానాలు బాగానే ఉన్నాయి. ప్రేక్షకుల ఎక్స్‌ప్టెటేషన్స్‌కు ధీటుగా సినిమాని తెరకెక్కించారని అంటున్నారు ఇప్పటికే చూసిన ప్రేక్షకులు. ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.

ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు.. రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా లేడీ అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇవ్వడం, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అన్నీ కలిసి వచ్చాయి ఈ చిత్రానికి. మహేష్ బాబు యాక్షన్ ఎనర్జిటిక్‌గా ఉందంటున్నారు. కొన్ని సీన్లు ఎంటర్‌టైన్‌మెంట్‌ని బాగా పండించాయని అంటున్నారు. విజయశాంతి నటన అద్భుతంగా ఉందని, హీరోయిన్ రష్మిక పాత్ర చాలా అతిగా ఉందని ట్వీట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి డైలాగులు అద్భుతంగా ఉన్నాయని పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ప్రస్తావించారు. ఒక్క మూడు నెలలు ఆర్మీలో పని చేస్తే నేను అనే ఫీలింగ్ పోయి నేషన్ అనే ఫీలింగ్ మొదలవుతుంది అని రాంజీ ట్వీట్ చేశారు. రత్నవేలు సినిమా‌టోగ్రఫీ అద్భుతంగా ఉందని అంటున్నారు.

Read MoreRead Less
Next Story