100 అడుగుల లోయలో పడి పోయిన కొడుకు.. అమ్మ ఫోన్‌తో..

100 అడుగుల లోయలో పడి పోయిన కొడుకు.. అమ్మ ఫోన్‌తో..

call

అమ్మ ఫోన్ కాల్ ఆపదలో చిక్కుకున్న అబ్బాయిని కాపాడింది. 100 అడుగుల లోతులో పడిపోయిన కొడుకుని తల్లి కాపాడింది. పూణేకి చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ప్రవీణ్ ఠాక్రే సింహగఢ్ కోటను చూసేందుకు వెళ్లాడు. కోట అందాలను పరికిస్తూ పక్కనే ఉన్న లోయలో పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇంతలో తల్లి నుంచి ఫోన్ వచ్చింది. ఒక్కసారిగా తనకు ఎక్కడ ఉన్నదీ అర్థమైంది. వెంటనే తల్లి కాల్ అందుకుని తానెక్కడ ఉన్నదీ ఆమెకు వివరించాడు. దీంతో ఆమె బంధువులకు, ప్రవీణ్ స్నేహితులకు సమాచారం అందించి కొడుకుని కాపాడమని కోరింది. ప్రవీణ్ సోదరి కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయం కోరింది. అందరూ కలిసి ప్రవీణ్‌ని లోయలో నుంచి బయటకు తీశారు. చిన్న చిన్న గాయాలతో బయటపడిన ప్రవీణ్ బయటపడ్డాడు.

Read MoreRead Less
Next Story