అమరావతి రైతులకి మద్దతుగా ఉద్యమానికి సిద్ధమవుతున్న జనసేన

అమరావతి రైతులకి మద్దతుగా ఉద్యమానికి సిద్ధమవుతున్న జనసేన

pavan

రాజధాని ఉద్యమంపై కార్యాచరణ సిద్ధం చేస్తోంది జనసేన. శనివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. దీనికి 13 జిల్లాల ముఖ్యనేతలు హాజరయ్యారు. రాజధాని తరలింపు అంశాన్ని జనసేన ఇప్పటికే వ్యతిరేకించింది. రాజధానిగా అమరావతే ఉండాలని డిమాండ్ చేస్తోంది. ప్రజల ఆంకాంక్ష కూడా ఇలాగే ఉందని జనసేన చెప్తోంది. ఈ నేపథ్యంలో.. తాజా రాజకీయ పరిణామాలు, రైతుల ఉద్యమాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అలాగే.. పార్టీ పరంగా చేపట్టే భవిష్యత్‌ కార్యాచణపై కూడా కసరత్తు చేస్తున్నారు.

Tags

Next Story