పండుగకు పర్‌ఫెక్ట్ ఎంటర్ టైనర్.. 'సరిలేరు నీకెవ్వరు' మూవీ రివ్యూ

పండుగకు పర్‌ఫెక్ట్ ఎంటర్ టైనర్.. సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ

movie-review

విడుదల తేదీ : జనవరి 11, 2020

నటీనటులు : మహేష్ బాబు, విజయ శాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, రావు రమేష్, సంగీత తదితరులు

దర్శకత్వం : అనిల్ రావిపూడి

నిర్మాత‌లు : రామ బ్రహ్మం సుంకర

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు

ఎడిటర్: తమ్మిరాజు

శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి ఇలాంటి హెవీ సబ్జెక్ట్స్‌తో బ్లాక్ అయిన మహేష్ బాబు, కాస్త మాస్‌కి దూరం అయ్యాడు.. ఆ గ్యాప్‌ని ఫిల్ చేసేందుకు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘ సరిలేరు నీకెవ్వరు’ తో వచ్చాడు.. మరి మాస్ తో మహేష్ చేసిన మ్యాజిక్ ఏంటో చూద్దాం...

కథ :

ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ (మహేష్ బాబు) ఉగ్రవాదుల చేతిలో బంధీ అయిన పిల్లల కోసం చేసిన రెస్కూ ఆపరేషన్‌లో తోటి సైనికుడు అజయ్ ( సత్యదేవ్) ప్రాణాపాయ స్థితిలో పడతాడు. అజయ్ కుటుంబం కోసం తన సీనియర్ ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) తో కలసి కర్నూల్ బయలు దేరతాడు. ఆ ప్రయాణంలో సంస్కృతి (రష్మిక ) ఆమె కుటుంబం పరిచయం అవుతుంది. కర్నూల్ వెళ్ళిన అజయ్‌కి అక్కడ భారతి కుటుంబం (విజయశాంతి) కనపడదు. ఆమె కుటుంబాన్ని చంపాలని చూస్తున్న మినిస్టర్ ( ప్రకాష్ రాజ్) కి అజయ్ సవాల్ గా మారతాడు. సైనికుడు కుటుంబాన్ని కాపాడేందుకు అజయ్ చేసిన పోరాటం ఏంటి..? అనేది మిగిలిన కథ..?

కథనం:

మహేష్ బాబుతో ఈ మద్య కాస్త హెవీ సబ్జెక్ట్ లతో మాస్ ఆడియన్స్ కి గ్యాప్ ఇచ్చాడు. మళ్ళీ పోకిరి, దూకుడులో ఎంటర్ టైన్ చేసిన మహేష్ స్ర్కీన్ మీద మిస్ అవుతున్న ఫీల్ ని కరెక్ట్ గా క్యాచ్ చేసినట్లున్నాడు దర్శకుడు అనీల్ రావి పూడి. మాస్ ఎంటర్ టైనర్ తో మహేష్ బాబును ని పండక్కి ఫర్ ఫెక్ట్ గా లాంచ్ చేసాడు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సినిమా అనగానే అచ్చిరాదనే కాన్సెప్ట్‌ని కూడా ‘సరిలేరు నీకెవ్వరు బద్దలు కొట్టింది’ మేజర్ అజయ్ గా పరిచయం అయిన మహేష్ ట్రైన్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే పక్కా మాస్ హీరో అయిపోయాడు.

అక్కడ రష్మిక, సంగీత చేసిన కామెడీ పుల్ ఎంటర్ టైన్మెంట్ గా సాగింది. గీత గోవిందం తో తెలుగు లో ప్రేక్షకుల్లో బలమైన ముద్రను వేసిన రష్మికకు స్టార్ వాల్యూ యాడ్ అయ్యింది. కన్నింగ్ ఫ్యామిలీ గా ఎంటర్ టైన్ చేసిన రష్మిక్ అండ్ కో చేసిన అల్లరి కాసేపు కితకితలు పెట్టింది. రావు రమేష్ తన మాడ్యులేషన్ తో ఒక్క సీన్ అయినా హైలెట్ గా చేసాడు. కర్నూల్ లో ల్యాండ్ అయిన కథ మరికాస్త గ్రిప్పింగ్ గా మారింది. భారతి గా విజయశాంతి నటన ఆ పాత్రకు హుందాతనం తెచ్చింది. మహేష్ బాబు లోని మాస్ హీరో విజృంభించిన సీన్ కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్లో సీన్.. ఈ ఇంటర్వెల్ బ్లాక్ ఆ ముందు వచ్చే ఫైట్ సీన్ హైలెట్ గా నిలిచాయి.

సెంకండాఫ్ లో కథ, కథనాలకంటే క్యారెక్టరైజేషన్స్ తో ప్రేక్షకులు ట్రావెల్ అవుతారు. ప్రకాష్ రాజ్ విలన్ గా మరోసారి అలరించాడు. సవాళ్లు ప్రతి సవాళ్ళు కమర్షియల్ సినిమాలో మామూలే అయినా ఒక సీన్ లో మహేష్ పొలిటీషియన్స్‌కి వేసిన ప్రశ్నలు దర్శకుడు అనీల్ రావిపూడి సమాజాన్ని ఇంత నిశితంగా చూస్తాడా అనిపించింది. విజయశాంతి మహేష్ మద్య వచ్చే ఎమోషనల్ సీన్ చివర్లో మహేష్ ఇచ్చే రెస్సాన్స్ ప్రేక్షకులదిలా అనిపించింది. అవటానికి కుటుంబం కథ లాగా అనిపించినా అందులోని బలమైన ఎమోషన్స్ బాగా ఆడియన్స్ ని ఈ కథకు కనెక్ట్ చేసాయి.

ఇక ‘భగ భగ మండే’ పాట సిట్యువేషన్ చాలా బాగా కుదిరింది. మహేష్ ఈ మద్య డాన్స్ లు చేయడం లేదు.. అనే కంప్లైంట్ కి ఆన్సర్ ‘మైండ్ బ్లాక్’ సాంగ్ .. ఈ పాటలో మహేష్, రష్మికలు రెచ్చిపోయారు.. మహేష్ స్వింగ్స్‌కి థియేటర్ దద్దరిల్లిపోయింది. క్లైమాక్స్ లో రష్మిక, ప్రకాష్ రాజ్ ల క్యారెక్టర్స్ లతో దర్శకుడు చేసిన హ్యూమర్ నిజంగా మైండ్ బ్లాక్. దేవిశ్రీ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

చివరగా:

మహేష్ మైండ్ బ్లాక్ చేసాడు. పండుగకు ఫర్‌ఫెక్ట్ ఎంటర్ టైనర్ ....

Read MoreRead Less
Next Story