అమరావతిలో దొరికనవాళ్లను దొరికినట్టు చితకబాదేస్తున్న పోలీసులు

అమరావతిలో దొరికనవాళ్లను దొరికినట్టు చితకబాదేస్తున్న పోలీసులు

srilakshmi

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఆందోళనలు 26వ రోజుకు చేరాయి. పోలీసులు దమనకాండకు పాల్పడుతున్నారు. రైతులు మాత్రం ఎప్పట్లాగే శాంతియుతంగా నిరసనలు తెలపాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం కూడా రైతులు తమ పోరాటాన్ని కొనసాగించనున్నారు. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉందని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఇళ్ల నంచి బయటకు వచ్చే రైతులు, మహిళలపై పోలీసులు అత్యంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు. అమరావతి రైతులపై లాఠీలు విరుగుతున్నాయి. ఖాకీలు క్రౌర్యం ప్రదర్శిస్తున్నారు. ఏమాత్రం దయ, దాక్షిణ్యాలు లేకుండా.. దొరికనవాళ్లను దొరికినట్టు చితకబాదేస్తున్నారు. మహిళలను డొక్కలో కుమ్మేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story