మున్సిపల్‌ ఎన్నికలు.. రెబల్స్‌ని బుజ్జగిస్తున్న కేటీఆర్

మున్సిపల్‌ ఎన్నికలు.. రెబల్స్‌ని బుజ్జగిస్తున్న కేటీఆర్

ktr

మున్సిపల్‌ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌.. గెలుపే లక్ష్యంగా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులతో TRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రచార సరళిపై.. గెలుపు వ్యూహాలపై సుదీర్ఘ కసరత్తు చేశారు. పట్టణాల్లో ఉన్న గ్రౌండ్‌ రియాలిటీని అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఎమ్మెల్యేలు చెప్పారు. ఐతే.. మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని KTR పిలుపునిచ్చారు. దాఖలైన నామినేషన్లు, వివిధ పార్టీల బలాబలాలను పట్టణాల వారీగా అడిగి తెలుసుకున్నారు.

పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ చేసిన మార్గదర్శనం మేరకు పనిచేయాలని నేతలకు సూచించారు కేటీఆర్. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రచారం ఉండాలని చెప్పారు. పార్టీ ప్రచార సామాగ్రి కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇంటింటి ప్రచారంపై ప్రత్యేక దృష్టిసారించాలని... అభ్యర్థి ప్రతీ ఇంటికి వెళ్లి ప్రచారం చేసేలా కార్యాచరణ ఉండాలని కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

అటు.. మున్సిపల్‌ ఎన్నికల్లో రెబల్స్‌ బెడద తగ్గించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పార్టీ బి ఫామ్‌లు ఇచ్చిన అభ్యర్థికే సహకరించాలని బుజ్జగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆశావహులకు నామినేటెడ్‌ పోస్టులు, ఇతర అవకాశాలు ఉంటాయని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story