ఆంధ్రప్రదేశ్

బ్రేకింగ్.. రాజీనామా యోచనలో ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్విరాజ్?

బ్రేకింగ్.. రాజీనామా యోచనలో ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్విరాజ్?
X

prudvi

ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్విరాజ్ రాజీనామా యోచనలో ఉన్నారు. తన దగ్గర పనిచేసే ఓ మహిళతో ఆయన చేసిన ఫోన్‌ సంభాషణ రచ్చ రాజేసింది. ఇంటర్నెట్‌లో, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనిపై ఉద్యోగ, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, శ్రీవారి భక్తులు భగ్గుమంటున్నారు. మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించే కామాంధుడిని.. పవిత్రమైన తిరుమల కొండపై ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు.

ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్విరాజ్ వ్యవహార శైలిపై వైసీపీ అధిష్టానం కూడా గుర్రుగా ఉంది. నోటి దురుసుతో ఆయన రోజుకో వివాదం రాజేస్తున్నారనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. దీంతో.. పృథ్విని SVBC చైర్మన్ పదవి నుంచి తప్పించాలని వైసీపీ నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఈలోపు.. తానే రాజీనామా చేయాలని పృథ్వి యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్విరాజ్... తన దగ్గర పనిచేసే ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో టేపులను.. ఇటు రాజధాని మహిళలు, అటు తిరుపతిలోని ఉద్యోగ సంఘాలు మీడియాకు విడుదల చేశారు. ఇలాంటి కామాంధుడికి కొండపై కొలువు ఎలా ఇస్తారంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సోషల్‌ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. అటు శ్రీవారి భక్తులు సైతం.. పృథ్విని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పృథ్వి రాసలీలలపై విచారణ జరిపించాలని కోరుతున్నారు.

Next Story

RELATED STORIES