ఆంధ్రప్రదేశ్

జనసేన నాయకులు, కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి

జనసేన నాయకులు, కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి
X

ycp-attack

కాకినాడలో వైసీపీ కార్యకర్తలు వీధి రౌడీల్లా మారిపోయారు. జనసేన కార్యకర్తలపై రాళ్లదాడికి దిగారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌పై అసభ్యకరంగా మాట్లాడ్డంపై జనసేన కేడర్‌ భగ్గుమంది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి ముట్టడికి బయల్దేరారు. భానుగుడి సెంటర్ నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయల్దేరగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఇంతలో వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు.

కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీధులు రణరంగంగా మారిపోయాయి. భానుగుడి సెంటర్‌ నుంచి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి ర్యాలీగా బయల్దేరిన జనసేన నాయకులు, కార్యకర్తలపై ఎదురుదాడికి దిగారు వైసీపీ కార్యకర్తలు. ద్వారంపూడి అభిమానులు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు.

దీంతో.. వైసీపీ కేడర్‌ మరింతగా రెచ్చిపోయింది. జనసేన నాయకులను తరిమితరిమి కొట్టారు.

Next Story

RELATED STORIES