కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

terror

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా పుల్వామా జిల్లా ట్రాల్ ప్రాంతంలో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ట్రాల్‌లోని ఓ రెసిడెన్షియల్ ఫ్లాట్‌లో కొందరు ఉగ్రవాదులు దాక్కున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చాయి. దాంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకొని కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, సైనిక దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

ప్రస్తుతం గుల్షన్‌పోర ఏరియాలో గాలింపు కొనసాగుతోంది. మిగిలిన ఉగ్రవాదుల కోసం బలగాలు పెద్దఎత్తున కూంబింగ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, షోపియాన్‌లో మిలిటెంట్ల స్థావరాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ కొన్ని బ్లాంకెట్లు, ఆహార పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story