హైకోర్టును ఆశ్రయించిన అమరావతి ప్రాంత రైతులు

హైకోర్టును ఆశ్రయించిన అమరావతి ప్రాంత రైతులు

ap-high-court

రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్టు-30 అమలును సవాల్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాసేపట్లో ఈ పిటిషన్‌పై విచారణ మొదల్యయే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా రాజధాని గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉదయాన్నే గ్రామాల్లో భారీ కవాతు నిర్వహిస్తూ.. ధర్నాలు, ర్యాలీలకు ఎలాంటి అనుమతుల్లేవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శాంతియుతంగా చేస్తున్న ధర్నాలకు కూడా ఆటంకాలు కల్పిస్తున్నారు. అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే తప్ప 144 సెక్షన్ విధించొద్దంటూ ఇటీవలే సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

Tags

Read MoreRead Less
Next Story